Homeతెలంగాణతుంగపాడు: అంబేద్కర్ విగ్రహం కోసం స్థలం కేటాయించాలి

తుంగపాడు: అంబేద్కర్ విగ్రహం కోసం స్థలం కేటాయించాలి

మిర్యాలగూడ, (క్రైమ్ మిర్రర్): మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కోసం గ్రామపంచాయతీ స్థలం కేటాయించాలని అంబేద్కర్ యూత్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శి మాధవరెడ్డి, సర్పంచ్ బెడుదూరి వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఆయన ఆలోచనలు, స్ఫూర్తి మరింతగా చేరుతాయని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుగంట్ల లింగయ్య, నందిపాటి ఆశీర్వాదం, నాగయ్య పాల్గొన్నారు.అలాగే అంబేద్కర్ యూత్ నాయకులు రేమడాల అచ్యుత్, కోట దుర్గ, మచ్చ మధు, గద్దల చరణ్, శ్రీకాంత్, చంటి తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు