ఒంగోలు, క్రైమ్‌మిర్రర్: ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ కాంపిటీటర్లకు ఆదర్శంగా నిలిచి, శ్రమించి సాధించిన విజయాన్ని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక ఐపీఎస్ ట్రైనీ అధికారి.. వ్యక్తిగత ప్రవర్తనా లోపాలు, విలువలేని నిర్ణయాలతో తన చేజేతులా కెరీర్‌ను నాశనం చేసుకున్న ఆశ్చర్యపరుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో వెలుగు చూసిన వరుస పరిణామాలు, సహ-ట్రైనీతో వివాదం , ఆ తర్వాత చోటుచేసుకున్న డ్రామాలు ఆయన తీవ్రమైన నైతిక పతనానికి నిదర్శనంగా నిలిచాయి. ఉన్నతమైన స్థానానికి చేరుకున్న తొలి మెట్టులోనే నైతికంగా దృఢంగా నిలబడాల్సింది పోయి, ప్రవర్తనా నియమావళిని విస్మరించడం వల్లనే ఈ పరిణామాలు పీకల మీదకు వచ్చాయి.తోటి వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారితో ఉన్న వ్యక్తిగత సంబంధం బెడిసికొట్టడం, దానిపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేంతగా విభేదాలు రావడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన వైఖరి మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read:రేపటి నుంచే జింబాబ్వేతో టీ20లు.. ప్లేయింగ్ 11 ఇదేనా?
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం, లీగల్ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించడం , సింపతీ పొందడానికి ఆత్మహత్యాయత్నం నాటకాలు ఆడటం వంటి చర్యలు సర్వీస్ నిబంధనలకు సంపూర్ణంగా విరుద్ధం. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాల్సిన లేదా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను రోడ్డున పడేసి, రచ్చ చేసుకోవడం ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డి తన ప్రొఫెషనలిజాన్ని గాలికి వదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.భారత సివిల్ సర్వీసెస్‌లో పనిచేసే అధికారులకు నైతికత , ఆత్మనిగ్రహం, భావోద్వేగ నియంత్రణ అత్యంత కీలకమైన అంశాలు. బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి, ట్రైనింగ్ దశలోనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, నైతిక లోపాలు ఎదుర్కొని కేంద్ర హోంశాఖ ద్వారా సస్పెన్షన్‌కు గురికావడం ఒక రకంగా వ్యవస్థాత్మక వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది.
Also Read:కర్ణాటకలో విషాదం: భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య
విజయం నెత్తికెక్కించుకోకుండా, తన లక్ష్యాన్ని, రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలను నిరంతరం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఉదయ్ కృష్ణారెడ్డి.. తప్పు మీద తప్పు చేస్తూ తన కెరీర్‌ను రిస్కులో పెట్టుకున్నారుఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ తీసుకున్న కఠిన చర్యల వల్ల ఆయనకు తన తప్పులను దిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఐపీఎస్ స్థాయికి ఎదిగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో నియంత్రణ, బాధ్యత లోపిస్తే ఎంతటి ఉన్నతమైన కెరీర్ అయినా క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుందనడానికి ఈ సంఘటన ఒక బలమైన హెచ్చరిక. సివిల్ సర్వీసెస్ సాధించాలనుకునే వేలాది మంది యువతకు ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఒక పాఠంగా నిలవనుంది. సామర్థ్యం ఎంత ముఖ్యమో, వృత్తిపరమైన, వ్యక్తిగత నైతికత అంతకంటే ముఖ్యం. విజయం మత్తులో ఉదయ్ దీన్ని మర్చిపోయారు.