Homeఆంధ్ర ప్రదేశ్చిన్న శ్రీను ఆన్ డ్యూటీ...!

చిన్న శ్రీను ఆన్ డ్యూటీ…!

  • అరకు పార్లమెంట్ స్థానానికి పరిశీలకుడిగా నియామకం

  • అక్కడ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు అందించే బాధ్యత

  • విజయనగరం జడ్పీ పీఠం ఆయన కుమార్తెకే?

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: టిడిపిలో చేరిన అనతి కాలంలోనే చిన్న శ్రీనుకు పార్టీ హై కమాండ్ గుర్తింపు ఇచ్చింది. కీలకమైన అరకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టింది. పరిశీల కుడిగా నియమించింది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

ఆ పార్లమెంటు స్థానం పరిధిలోని అరకు, పాడేరులో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం.

అందుకే అక్కడ పార్టీ బాధ్యతలను చిన్న శ్రీనుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సీటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోనివి. అందుకే చిన్న శ్రీనుకు బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా ఏకపక్షంగా విజయం సాధించాలన్నది చంద్రబాబు వ్యూహం.

పార్టీలో చేరిన నెల రోజులకే చిన్న శ్రీనుకు ఈ కీలక బాధ్యతలు ఇవ్వడం వెనుక నూటికి నూరు శాతం విజయం సాధించాలన్న వ్యూహం ఉంది. మరోవైపు తమ నేతకు తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు కట్టబెట్టడంపై చిన్న శ్రీను అభిమానులు ఆనందంతో ఉన్నారు.

  • వైసీపీ అక్కడ స్ట్రాంగ్..

మొన్నటి ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ తనుజారాణి విజయం సాధించారు. అరకు పార్లమెంటు స్థానం పరిధిలో అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇందులో ఐదు స్థానాల్లో కూటమి గెలిచింది.

రెండు స్థానాల్లో గెలిచిన వైసిపి పార్లమెంట్ సీటును సైతం కైవసం చేసుకుంది. తద్వారా వైసిపికి ఇక్కడ ఉన్న పట్టు తెలుస్తోంది. అందుకే ఈ నియోజకవర్గ పరిశీలకుడిగా చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించింది టిడిపి హై కమాండ్.

దాదాపు ఈ నియోజకవర్గాలతో చిన్న శ్రీనుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించేందుకు వీలుగా చిన్న శ్రీను నియామకం జరిగినట్లు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

  • టిడిపిలో ఆశ్చర్యం..

మరోవైపు పార్టీలో చేరిన నెల రోజులకే చిన్న శ్రీను నియామకం టిడిపి వర్గాల్లో కూడా ఆశ్చర్యపరుస్తాంది. ఒక ఒప్పందం ప్రకారమే చిన్న శ్రీను టిడిపిలో చేరినట్లు ప్రచారం నడుస్తోంది. మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రానుంది. విజయనగరం కార్పొరేషన్ స్థానాన్ని జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి టిడిపికి ఉండిపోతుంది. అయితే జడ్పీ చైర్ పర్సన్ గా తన కుమార్తెను రంగంలోకి దించాలని చిన్న శ్రీను భావించారు. ఆ ఆలోచనతోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు.

అయితే ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో.. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో టిడిపిని గెలిపిస్తే అనే షరతుతోనే చిన్న శ్రీనుకు అక్కడ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి అందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు