Homeతెలంగాణప్రియురాలి దారుణ హత్య...! ఒడిశా అడవుల్లో ప‌డేసిన కారు డ్రైవ‌ర్‌...

ప్రియురాలి దారుణ హత్య…! ఒడిశా అడవుల్లో ప‌డేసిన కారు డ్రైవ‌ర్‌…

విశాఖపట్నం, క్రైమ్‌మిర్ర‌ర్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే నెపంతో ఒక కారు డ్రైవర్ తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది మృత దేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి, ఎవరికీ తెలియకుండా పక్క రాష్ట్రమైన ఒడిశాకు తరలించి అడవుల్లో పడేసిన ఘాతుకానికి పాల్పడ్డాడు.పెళ్లి ప్రస్తావన తేవడమే పాపమైంది పోలీసుల కథనం ప్రకారం కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ (32) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి పెందుర్తికి చెందిన సంధ్య (20) అనే యువతితో పరిచయం ఏర్పడింది అది కాస్తా వివాహేతర శారీరక సంబంధానికి దారితీసింది. అయితే గత నెల 15వ తేదీన సంధ్య తనను పెళ్లి చేసుకోవాలని సురేష్‌ను కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన సురేష్ కుమార్ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.

Also Read:ఎట్టకేలకు ఆ ఇద్దరు!

సూట్‌కేస్ లో మృత‌దేహాన్నికుక్కి ఒడిశా అడ‌వుల్లో ప‌డేసిన నిందితుడు….

హత్య అనంతరం నిందితుడు జగదాంబ సెంటర్‌లో ఒక పెద్ద సూట్‌కేస్‌ను కొనుగోలు చేశాడు సంధ్య మృత దేహాన్ని ఆ సూట్‌కేస్‌లో కుక్కాడు. ఆపై రైలు మార్గంలో ఒడిశాలోని రాయగడ (జేకే పూర్) పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేశాడు ఏమీ తెలియ నట్టు మళ్లీ నగరానికి తిరిగి వచ్చాడు.దుర్గంధంతో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ అటవీ ప్రాంతంలో ఉన్న ఆ సూట్‌కేస్ నుంచి తీవ్రమైన దుర్గంధం రావడాన్ని గమనించిన ఒడిశా పోలీసులు రంగంలోకి దిగారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రైల్వే స్టేషన్లు,పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణం గా పరిశీలించగా సురేష్ కుమార్ గుట్టు రద్దయింది వెంటనే ఒడిశా పోలీసులు విశాఖపట్నం పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్య తో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే, పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్న సంధ్యను హత్య చేసినట్లు సురేష్ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీ కరించాడు. దీంతో ఒడిశా పోలీసులు నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడ కోర్టుకు తరలించారు.

Also Read:తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్టే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు