Homeతెలంగాణఆ నేతలంతా తెలంగాణ రక్షణ సేనలోకి క్యూ...!

ఆ నేతలంతా తెలంగాణ రక్షణ సేనలోకి క్యూ…!

  • గులాబీ పార్టీలో అవకాశం దక్కని నాయకులు కవిత చెంతకు

  • రోజుకో నేత చొప్పున చేరిక

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కవిత పక్కా పొలిటికల్ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు తెలంగాణలో. గులాబీ పార్టీని విభేదించిన ఆమె తెలంగాణ రక్షణ సేన పేరుతో మళ్లీ టిఆర్ఎస్ను పునరుద్ధరించారు. అయితే నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా.. రక్షణ పేరుతో గట్టిగానే వ్యూహం రూపొందించుకున్నారు. అయితే రాజకీయ అవకాశాలు లేక.. చాన్స్ కోసం ఎదురుచూస్తున్న నేతలను బాగానే ఆకర్షిస్తున్నారు కవిత. సాదాసీదా నేతలను కూడా వెలుగులోకి తెచ్చి పార్టీలో చేర్పించుకుంటున్నారు. వ్యూహాత్మకంగా రోజుకొకరి చొప్పున చేరిక ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. తద్వారా తన పార్టీని, తాను నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు.

అవకాశాల కోసం వెయిటింగ్..
తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన అవకాశాల కోసం చాలా మంది నేతలు వెయిటింగ్ లో ఉన్నారు.. ప్రధానంగా గులాబీ పార్టీలో తెలంగాణ శక్తుల ఏకీకరణ పేరుతో చాలామంది నేతలను అప్పట్లో చేర్చుకున్నారు. అయితే అవకాశాలు దక్కింది మాత్రం కొందరికే. అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఒక రాజకీయ కేంద్రంగా మారింది. గతంలో రాజకీయాల్లో కీలకంగా ఉండి.. తరువాత గుర్తింపు దక్కని చాలామంది నేతలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన వైపు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నేతల చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఇంకోవైపు ప్రతిపక్షం కోసం బిజెపి వర్సెస్ బి ఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదో ఒక రాజకీయ ఉనికి చాటుకోవాలనుకున్న నేతలు చాలామంది ఉన్నారు. అటువంటివారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది తెలంగాణ రాష్ట్ర సేన.

రివర్స్ వ్యూహాలతో కవిత..
కవిత తెలంగాణలో రివర్స్ వ్యూహాలతో ఆకట్టుకుంటున్నారు. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన వారైనా, పాత పరిచయాలు ఉన్న నేతలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ.. రోజుకో నాయకుడిని పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల పార్టీకి క్యాడర్ పరంగా బలం చేకూరడమే కాకుండా.. తాను టార్గెట్ చేసిన గులాబీ పార్టీ బలహీనపడుతుంది అనేది కవిత అంచనా. ఇటీవల కెసిఆర్ పార్టీని సమూల ప్రక్షాళన చేశారు. నియోజకవర్గాల్లో బలమున్న నేతలను రంగంలోకి దించుతామని చెప్పారు. దీంతో చాలామంది నేతల్లో అభద్రతాభావం ఏర్పడింది. అటువంటి వారితో ముందుగానే సంప్రదింపులు జరుపుతున్నారు కవిత. వారిని తన పార్టీ వైపు తిప్పుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తానికి అయితే అవకాశాలు లేని నేతలకు తెలంగాణ రాష్ట్ర సేన అనేది గొప్ప వేదికగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు