Homeతెలంగాణబిజెపికి మ‌ద్ద‌తుకు బూస్ట్‌

బిజెపికి మ‌ద్ద‌తుకు బూస్ట్‌

  • ఈ నెల 7, 8 ప‌వ‌న్ ప్ర‌చారం
  • బీజేపీ నాయ‌కుల్లో ఉత్సాహం

హైదరాబాద్‌,క్రైం మిర్ర‌ర్‌:

తెలంగాణ లో మున్సిప‌ల్ ఎన్నిక‌లో త్వ‌ర‌లోజ‌రుగ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ మ‌ద్ద‌తుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ తెలంగాణ‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మేర‌కుకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఆయ‌న నివాసంలో క‌లిసి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

దీంతో ప్ర‌చారంలో పాల్గొనాల‌ని కోర‌గా దానికి ఆయ‌న ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. దీంతో ఈ నెల 7, 8తేదీల్లో తెలంగాణలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి పవన్‌ కల్యాణ్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నారామ‌చంద‌ర్‌రావు తెలిపారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికలతో సహా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగాచ‌ర్చ‌లు జ‌రిపామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి పవన్‌ కల్యాణ్‌ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించిన‌ట్లు తెలిపారు.

బీజేపీ, జ‌నసేన పార్టీస్నేహ‌పూర్వ‌క‌పోటీ అంటూ ట్వీట్‌…

ఇదిలా ఉండ‌గా ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా బీజేపీ, జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేయ‌డం కొస‌మెర‌పు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు