క్రైమ్ మిర్రర్, సినిమా:- యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక నేపథ్యంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా హీరోయిన్ ఎంపికపై ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.సమాచారం ప్రకారం, సుబ్రహ్మణ్య స్వామి గాథ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మురుగన్ పాత్రలో కనిపించనున్నారని టాక్. పురాణాల ప్రకారం ఈ కథలో కీలకమైన మహిళా పాత్రలు ఉండటంతో, వాటిలో ఒక పాత్ర కోసం కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కన్నడ సినిమాపై దిల్ రాజు రూ.120 కోట్ల భారీ పందెం.. కెరీర్‌లోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డీల్!
గతంలో ఎన్టీఆర్, కియారా అద్వానీ ఒకే ప్రాజెక్ట్‌లో కనిపించినప్పటికీ, ఈసారి నేరుగా హీరో-హీరోయిన్లుగా జోడీ కట్టే అవకాశం ఉందన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే, ఇది పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై మరింత హైప్ తీసుకురానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం తెలిసిందే. దీంతో గాడ్ ఆఫ్ వార్‌లో కియారా నటిస్తే ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండే అవకాశముందని చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వార్తలతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కియారా అద్వానీ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోని గాడ్ ఆఫ్ వార్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడే వరకు వీటిని ప్రచారంగానే పరిగణించాలి.
వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ కార్డ్… క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!