Homeతెలంగాణబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్న‌రు... పెద్దపల్లి ఎంపీ ఫైర్‌...!

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్న‌రు… పెద్దపల్లి ఎంపీ ఫైర్‌…!

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని, ఈ వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ తీవ్రంగా ఖండించారు.. తెలంగాణ రాష్ర్ట‌ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ల విభజనతో పోలుస్తూ పార్లమెంట్లో చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంద‌ర్భంగా పెద్ద‌ప‌ల్లి ఎంపీ ఫైర్ అయ్యారు. తేజస్వి సూర్య మతి తప్పి మాట్లాడుతున్నారు సభలో పెట్టిన బిల్లు ఏంటి తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఏంటని అన్నారు.

తేజస్వి సూర్య మాట్లాడుతుంటే కనీసం అడ్డుకునే స్థితిలో కూడా బిజెపి తెలంగాణ ఎంపీలు లేకపోవడం సిగ్గుచేటు .బిజెపి మొదటి నుండి తెలంగాణ వ్యతిరేకి. ప్రధాని మొదలు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పలు సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయ‌న్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన సహించబోమని అన్నారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బిజెపి ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రేపిస్టులను టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి పార్టీ బిజెపిది అని ఎ ద్దేవా చేశారు. అట్లాంటి పార్టీ మహిళల హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. అత్రాస్, ఉన్నావ్ అత్యాచార దోషులను బిజెపిలో చేర్చుకుని ప్రోత్సహించింది ఆ పార్టీ నేతలే. సామ్రాట్ చౌదరి లాంటి రేపిస్ట్ ని ప్రోత్సహించేది కూడా బిజెపినే. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ టాపిక్ డైవర్షన్ కి పాల్పడుతున్నాడు. తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కోసం పోరాడింది, ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర‌ ఏం లేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు