జగిత్యాల,క్రైమ్ మిర్రర్:- బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నాపూర్ గ్రామంలో కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నాపూర్ గ్రామానికి చెందిన దమ్మ తిరుపతి అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారం అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం బస్టాండ్ వద్ద కులం పేరుతో దూషిస్తూ అవమానించాడు. అంతటితో ఆగకుండా, గట్టు గంగారం తన తమ్ముడు గంగాధర్, కుమారుడు గణేష్‌లతో కలిసి గ్రామ శివార్లలోని ఒక షెడ్డు వద్ద తిరుపతిపై మరోసారి భౌతిక దాడికి దిగారు. బాధితుడిని గాయపరిచి, తీవ్రంగా బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు.బాధితుడి తల్లి దమ్మ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు గట్టు గంగారం, గంగాధర్, గణేష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
సూరారం గ్రామంలో ప్రొసీడింగ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం
రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది?