Homeక్రైమ్శంషాబాద్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. రూ.30 లక్షలకు పైగా నగదు అపహరణ

శంషాబాద్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. రూ.30 లక్షలకు పైగా నగదు అపహరణ

హైదరాబాద్‌ శంషాబాద్‌ పరిధిలో భారీ ఏటీఎం చోరీ కలకలం రేపింది. సాతంరాయి ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంను టార్గెట్‌ చేశారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.30 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం వద్ద లభించిన ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

దుండగులు ఏటీఎంలోకి ఎలా ప్రవేశించారు? చోరీకి ఎంత సమయం పట్టింది? ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్‌ పరిధిలో జరిగిన ఈ చోరీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

also read: చదువులో వెనుకబడ్డారని 82 మంది విద్యార్థులకు సగం గుండు.. మహారాష్ట్రలో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు