Homeసినిమారామాయణం షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

రామాయణం షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ షూటింగ్‌ సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణ జరుగుతున్న స్టూడియో పరిసరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం ప్రకారం.. స్టూడియో బయట ఏర్పాటు చేసిన ఓ చిన్న టెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.

ఈ ఘటనపై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ స్పందించారు. ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.

భారీ సెట్లు, భారీ సంఖ్యలో సిబ్బందితో షూటింగ్‌లు జరిగే సమయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తివారీ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా షూటింగ్‌ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించిన చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు.

ఇక ‘రామాయణం’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి షూటింగ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అగ్నిప్రమాదం వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

also read: శంషాబాద్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. రూ.30 లక్షలకు పైగా నగదు అపహరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు