Homeఆంధ్ర ప్రదేశ్తాడిపత్రిలో హీటెక్కిన రాజకీయం.. టిడిపి, వైసిపి పోటాపోటీగా ఆందోళనలు

తాడిపత్రిలో హీటెక్కిన రాజకీయం.. టిడిపి, వైసిపి పోటాపోటీగా ఆందోళనలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి మధ్య సాగుతున్న రాజకీయ పోరు తాజాగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడిపత్రి వైసిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనకు సంబంధించి వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం నిర్వహిస్తుండగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోటీగా టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు. దీంతో వైసిపి కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పాలనపై నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా రావడంతో ఇక్కడ ఉధృత నెలకొంది. మరోవైపు వైసీపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ధీటుగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో ఇక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ముందుకు వెళ్ళకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కేడర్ పాల్గొనాలని ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలోనూ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంతానికి వెళుతుండగా తాడిపత్రి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పెద్దారెడ్డి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తీరుపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనను అడ్డుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇది ఎలా ఉంటే తాడిపత్రి నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం పై పార్టీ నేతలు స్థానికులు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. పోలీసులు టిడిపి నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. మరోవైపు తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అన్న ఆందోళన ప్రజలతో పాటు పోలీసులను నెలకొంది. ఇప్పటికే భారీ సంఖ్యలో పోలీసులను అక్కడ మోహరించారు. జెసి ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ ముగిసిన తర్వాత పెద్దారెడ్డి నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లేకపోతే పూర్తిగా ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు