Homeఆంధ్ర ప్రదేశ్మరో అల్పపీడనం.. 48 గంటల్లో భారీ వర్షాలు!

మరో అల్పపీడనం.. 48 గంటల్లో భారీ వర్షాలు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారులు వర్ష సూచన చేశారు. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తాజాగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రకటన విడుదల చేశారు. ఈ అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం దాటికి కోస్తాంధ్రలో గురువారం వరకు మరోవైపు రాయలసీమలో రేపటి సాయంత్రం వరకు కూడా వర్షాలు పడతాయని తెలిపారు. కాగా ఇవాళ జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

నేడు వర్ష సూచన జిల్లాలు :-
1. మన్యం
2. అల్లూరి
3. పోలవరం
4. అనకాపల్లి
5. కోనసీమ
6. తూర్పుగోదావరి
7. పశ్చిమగోదావరి
8. ఏలూరు
9. కృష్ణ
10. గుంటూరు
11. ఎన్టీఆర్
12. బాపట్ల
13. చిత్తూరు
14. తిరుపతి

కాగా ఈ రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు వినిపించిన వెంటనే రైతులు మరియు పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని సూచించారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు