Homeతెలంగాణబండి సంజయ్ కుమారుడు చుట్టూ వివాదం

బండి సంజయ్ కుమారుడు చుట్టూ వివాదం

•హనీ ట్రాప్ అంటున్న బండి భగీరథ్
•మైనర్ను వేధించాడంటూ ఎదురు ఫిర్యాదు
•ప్రధాని పర్యటన వేళ ట్విస్ట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు షాక్ తగిలింది. ఆయన కుమారుడు చుట్టూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హనీ డ్రాప్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలన్న ఫిర్యాదు కూడా వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు ఈ ఘటన జరగడం రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

కరీంనగర్ లో ఫిర్యాదు..
తనపై హనీ ట్రాప్ జరిగింది అంటూ బండి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం తనను ట్రాప్ చేసి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించింది అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సాధారణ మిత్రుల ద్వారా పరిచయమైన సదరు యువతీతో తాను కొన్నాళ్లు చాటింగ్ చేశానని.. ఆ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అందుకు తాను నిరాకరించడంతో ఇప్పుడు తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. ఇప్పటికే భయంతో ఓ 50 వేల రూపాయలు చెల్లించానని.. ఇప్పుడు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. లేకుంటే ఆ యువతీ తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫోక్సో కేసు నమోదు చేయాలని..
మరోవైపు బండి భగీరథ్ ఆరోపణలు చేస్తున్న ఆ కుటుంబం సైతం హైదరాబాదులోని ఓ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పై తిరిగి ఫిర్యాదు చేశారు. సదరు యువతి మైనర్ అని.. ఆమెను భగీరథ్ వేధించే వారిని ఆరోపిస్తూ ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే కుటుంబం నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్నేహితులను కూడా ఇలాగే వేధించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సరిగ్గా ముందు రోజే ఈ ఆరోపణలు రావడం వెనుక.. ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైనే పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. మున్ముందు ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు