టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాక’ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ప్రాంతంలో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో పాల్గొన్న శేఖర్ మాస్టర్, షూటింగ్ ముగిసిన అనంతరం తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. దీంతో కారు కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారంతా బయటకు వచ్చారు. అయితే ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన బృందంలోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఊరట చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాద వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
also read: రాప్తాడు నిందితుడికి అరుదైన ఆరోగ్య సమస్య.. వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడి!
