Homeతెలంగాణహైదరాబాద్ ఐటీ హబ్‌లో ప్రభాస్ కోసం మరో చార్మినార్...!

హైదరాబాద్ ఐటీ హబ్‌లో ప్రభాస్ కోసం మరో చార్మినార్…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో అసలైన చార్మినార్‌ను తలపించేలా భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సాధారణంగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీ గుర్తుకొస్తుంది. అయితే ఫౌజీ చిత్రీకరణ కోసం మేకర్స్ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. నిజమైన చార్మినార్ తరహాలోనే ఈ సెట్‌ను రూపొందిస్తున్న ఆర్ట్ డిపార్ట్‌మెంట్, ప్రతి చిన్న వివరాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సెట్ సినిమాలో కీలక సన్నివేశాలకు ఉపయోగించనున్నారు.

Also Read:ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు

అసలు చార్మినార్ వద్దే షూటింగ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, చిత్ర బృందం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ప్రభాస్‌కు ఉన్న భారీ అభిమాన వర్గం కారణంగా పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, దీంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని మేకర్స్ భావించారు. షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రత్యేక సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ చిత్రీకరణ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తి కానుందని తెలుస్తోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయనున్నారు.

Also Read:అరెస్ట్‌పై మండిపడ్డ ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇటీవల ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారాలకు నిర్మాతలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ స్పందిస్తూ, ముందుగా ప్రకటించినట్లుగానే ఫౌజీ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడింది. సుమారు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో ఇమాన్వి కథానాయికగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు