Homeక్రైమ్సోషల్ మీడియాలో 'అతి' చేస్తే కటకటాలే

సోషల్ మీడియాలో ‘అతి’ చేస్తే కటకటాలే

  • సోషల్ మీడియాలో ‘అతి’ చేస్తే కటకటాలే

  • వ్యక్తిగత దూషణలు, విద్వేష పూరిత పోస్టులపై నిఘా..

  • అడవిదేవులపల్లి ఎస్ఐ శేఖర్ హెచ్చరిక.

అడవిదేవులపల్లి (క్రైమ్ మిర్రర్): సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడితనానికి పాల్పడితే, ఊరుకునే ప్రసక్తే లేదని అడవిదేవులపల్లి ఎస్ఐ వి.శేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, ఇతర సామాన్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, వారి గౌరవానికి భంగం కలిగించినా, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నెట్టింట జరిగే ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవాలని, తప్పుడు ప్రచారాలతో సమాజంలో విద్వేషాలు నింపవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, రెచ్చగొట్టే పోస్టులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ వి. శేఖర్ సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు