Homeతెలంగాణపసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు

పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు

హన్మకొండ,క్రైమ్ మిర్ర‌ర్: చికెన్ సెంట‌ర్‌ల‌లో నిర్వాహకులు చికెన్ శుభ్రం చేసే స‌మ‌యంలో ప‌సుపుకు బ‌దులుగా అదేక‌ల‌ర్‌తో కూడిన కృత్రిమ రంగులు వాడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌న్మ‌కొండ ఫుడ్ ఇన్స్‌పెక్ట‌ర్ బ్ర‌హ్మాజీ హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న వినియోగ‌దారుల మండ‌లి ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి చ‌క్ర‌పాణితో క‌లిసి ఆయ‌న ప‌లు చికెన్ సెంట‌ర్‌ల‌లో త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంతరం మాట్లాడుతూ ర‌సాయ‌న రంగులు క‌లిపిన మాంసంతింటే ఉద‌ర పేగు క్యాన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు. ఎవ‌రైన కృత్రిమ రంగును వాడిచ‌ట్ట‌ప‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

తాజావార్తలు