Homeక్రైమ్జమ్ముకశ్మీర్‌లో కలకలం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న పాక్ యువకుడు అరెస్ట్!

జమ్ముకశ్మీర్‌లో కలకలం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న పాక్ యువకుడు అరెస్ట్!

జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఓ పాకిస్తాన్ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఆర్నియా సబ్‌సెక్టార్ పరిధిలోని సాయి కలాన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 20 ఏళ్ల అవైస్ రజాను స్థానికులు గుర్తించారు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా అతడు చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అధికారులకు అనుమానాలు మరింత పెరిగాయి. అతడు సరిహద్దు ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అక్కడికి చేరుకోవడం వెనుక అసలు కారణమేంటి? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

యువకుడు ఏదైనా కీలక సమాచారాన్ని దాస్తున్నాడా? అతడి రాక వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా? అనే అంశాలపై భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరిపై దాడి.. నర్సంపేటలో కలకలం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు