Homeతెలంగాణబాడీ షేమింగ్ పాలిటిక్స్...! రేవంత్ శరీర ఆకృతులపై విమర్శలు...

బాడీ షేమింగ్ పాలిటిక్స్…! రేవంత్ శరీర ఆకృతులపై విమర్శలు…

  • కేటీఆర్ నోటి నుంచి రాకూడని మాటలు

  • ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు పెరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ప్రెస్టేట్ అవుతున్నారు. విధానపరంగా విమర్శించాల్సింది పోయి బాడీ షేమింగ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి శారీరక ఎత్తును ఉద్దేశిస్తూ తాజాగా ఆయన మరిన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు. వాడు చిన్నగా ఉన్నాడు కానీ మా ముఖ్యమంత్రి రా భయ్.. నూకేయకుర్రి జరా.. ఈయన ఏమన్నా పెద్ద ఆరు ఫీట్లు ఉన్నాడా? అంటే అంత కూడా లేడు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కేటీఆర్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. కిందిస్థాయి నుంచి ఎదిగి రేవంత్ సీఎం అయ్యాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి.

ప్రజాస్వామ్యంలో సహజం…

ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు, విధానపరమైన విమర్శలు సహజం. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శారీరక ఆకృతిని ప్రస్తావిస్తూ మాట్లాడడం నాయకుల స్థాయికి తగదు. రాజకీయాల్లో ఒక నాయకుడి సమర్థతకు, నాయకత్వ లక్షణాలకు శారీరక ఎత్తు ఎప్పటికీ కొలమానం కాదు. కేవలం పొడుగు మాత్రమే నాయకత్వాన్ని అర్హత అయివుంటే.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి ఆ పదవిని చేపట్టేవారు కాదు. కేటీఆర్ స్వయంగా ప్రస్తావిస్తున్నట్టుగా ఏ పోలీస్ వ్యవస్తా అయితే ముఖ్యమంత్రిని తోసేసిందంటూ ఆయన యద్దేవా చేస్తున్నారో.. నేడు అదే రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పని చేస్తోంది. అధికారం అనేది శారీరక బలం లేదా ఆకృతి వల్ల కాకుండా.. ప్రజలు ఇచ్చిన తీర్పు, పాలనా దక్షత వల్ల వస్తుందని సత్యాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.

సులభం కావచ్చు కానీ...

బాడీ షేమింగ్ చేయడం సులభమైన పని కావచ్చు. ఇతరులను ఉద్దేశించి పొట్టోడు అనడం లేదా శారీరక లోపాలను, ఆకృతిని ఎత్తిచూపుతూ బాడీ షేమింగ్ చేయడం చాలా సులభమైన పని. క్షణికావేశంలో లేక సభల్లో చప్పట్ల కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయ ప్రసంగాల్లోని హుందాతనం దెబ్బతింటుంది. విదేశాల్లో చదువుకుని, ఆధునిక ఆలోచనలు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన కేటీఆర్ వంటి నేతల నుంచి సమాజం ఎంతో పరిణితితో కూడిన విమర్శలను ఆశిస్తుంది. వ్యక్తిగత ఆకృతిని అపహాస్యం చేయడం వల్ల ప్రత్యర్థులపై పై చేయి సాధించలేమని.. పైగా విమర్శించే వారి స్థాయిని తగ్గిస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇతరత్రా అంశాలు చాలా ఉన్నాయి. వాటి చుట్టూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది కానీ.. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
  2. పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
  3.  2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు