-
22 చోట్ల టిడిపి, నాలుగు చోట్ల జనసేన, బిజెపి ఒక్కచోట బాధ్యతలు
-
కూటమిలో సవ్యంగా పదవి పంపకాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో కూటమి మరో పొలిటికల్ సక్సెస్ సాధించింది . మూడు పార్టీల మధ్య జిల్లా పరిషత్ చైర్మన్ ల పంపకం సజావుగా పూర్తయింది. దీంతో 27 జిల్లాల్లో కూటమి నేతలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో పదవుల సర్దుబాటు జరగడం విశేషం. పరిషత్ ఎన్నికల్లో భాగంగా.. 28 జిల్లాలకు గాను 27 చోట్ల కూటమి అభ్యర్థులే గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితం అయింది. దీంతో మిగతా 27 జడ్పీ లకు సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను మూడు పార్టీలకు సర్దుబాటు చేశారు. 22 జడ్పీ చైర్మన్లు, 20 వైస్ చైర్మన్ పోస్టులు టిడిపికి దక్కాయి. నాలుగు జడ్పీ చైర్మన్ పోస్టులు, ఐదు వైస్ చైర్మన్లు జనసేనకు దక్కాయి. బిజెపికి ఒక జడ్పీ చైర్మన్, రెండు వైస్ చైర్మన్ లను కేటాయించారు.
బాధ్యతలు స్వీకారం…
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జడ్పీ చైర్మన్ ల తో పాటు వైస్ చైర్మన్లు తమ బాధ్యతలను స్వీకరించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జడ్పీలు జనసేన కు కేటాయించారు. కృష్ణా జిల్లా జడ్పీని బిజెపి కి కేటాయించారు. మరోవైపు విజయనగరం నుంచి మజ్జి సిరి సహస్ర, విశాఖ నుంచి గాడు అలివేణి, పోలవరం నుంచి వంతల రాజేశ్వరి, తూర్పుగోదావరి నుంచి కాడ పద్మ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గొల్లపల్లి అమూల్య, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇందుకూరి రామకృష్ణంరాజు, ఏలూరు నుంచి చింతమనేని సాయి నవ్య శ్రీ,, ఎన్టీఆర్ జిల్లా నుంచి కోట పుల్లమ్మ, గుంటూరు నుంచి ధార అరుణ, పల్నాడు నుంచి పుచ్చకాయల రమాదేవి, బాపట్ల నుంచి పుషడాపు రోహిణి, ప్రకాశం నుంచి కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు, మార్కాపురం నుంచి కందుల రామిరెడ్డి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు నుంచి చూడి ఉలిగయ్య, నంద్యాల నుంచి షేక్ బృహముద్దీన్, అనంతపురం నుంచి గంజి నాగరాజు, సత్యసాయి జిల్లా నుంచి పరిటాల శ్రీరామ్, వైయస్సార్ కడప జిల్లా నుంచి కొత్త నరసింహారెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి సుగవాసి ప్రసాద్ బాబు, తిరుపతి జిల్లా నుంచి హేమలత, చిత్తూరు జిల్లా నుంచి మాధలం శైలజ జిల్లా పరిషత్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాకు మాత్రమే పరిమితం అయింది.
ఇవి కూడ చదవండి:
- పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
-
పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
- 2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
-
ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
