Homeతెలంగాణసైబ‌రాబాద్ మున్సిప‌ల్‌లో స‌రికొత్త ఆంక్ష‌లు...! కిలో చెత్త‌కు రూ. 3....

సైబ‌రాబాద్ మున్సిప‌ల్‌లో స‌రికొత్త ఆంక్ష‌లు…! కిలో చెత్త‌కు రూ. 3….

  • ఫంక్షన్లో 100 మంది దాటితే కఠినంగా నిబంధనలు

  • కిలో వ్యర్థాలకు మూడు రూపాయల ఫీజు చెల్లించాల్సిందే

  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సరికొత్త ఆంక్షలు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే శుభకార్యాలు,, వేడుకలు, బహిరంగ సభలకు సంబంధించి ఘన వ్యర్ధాల నిర్వహణ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్యం మెరుగుపరచడం, వేడుకల అనంతరం రోడ్లపై చెత్తను పారవేసే సంస్కృతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల అమలుపై డిప్యూటీ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ లేని వేదికలు లేదా ఇతర ప్రాంతాల్లో 100 మందికి మించి హాజరయ్యే ఎలాంటి వేడుకలు, సమావేశాలు నిర్వహించాలన్న కనీసం మూడు పని దినాలు ముందుగా సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేశారు.

ప్రత్యేక పోర్టల్ ద్వారా…

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ ద్వారా ఈ ముందస్తు సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను సకాలంలో సేకరించేందుకు, తరలించేందుకు మున్సిపల్ సిబ్బందికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు భారీగా చెత్తను ఉత్పత్తి చేసే సంస్థలు, వేడుకల నిర్వాహకులపై ఆర్థిక బాధ్యతను కూడా కమిషనర్ నిర్దేశించారు. వేడుకలు, బల్క్ జనరేటర్ల వద్ద ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం కిలోకు సుమారు మూడు రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వేడుక జరిగిన ప్రాంగణంలోనే తడి చెత్త, పొడి చెత్త, ఇతర వ్యర్ధాలుగా విభజించి.. మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించిన అధికృత వ్యర్థ సేకరణ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

కమిషనర్ వెల్లడి…

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణ నిబంధనలోని ఆదేశాలను జారీ చేసినట్లు కమిషనర్ సృజన వెల్లడించారు. చెత్త సేకరణ, రవాణా తో పాటు శాస్త్రీయ పద్ధతిలో దానిని శుద్ధి చేసే బాధ్యత కూడా నిర్వాహకులదేనని తేల్చి చెప్పారు. ఈ కొత్త నిబంధనలపై తమ పరిధిలోని ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. పారిశుద్ధ్య అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో నిబంధనలను పక్కాగా అమలయ్యే విధంగా పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
  2. పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
  3.  2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు