Homeక్రైమ్రూ.10 లక్షల బ్లాక్‌మెయిల్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కాంగ్రెస్ నేత

రూ.10 లక్షల బ్లాక్‌మెయిల్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కాంగ్రెస్ నేత

క్రైమ్ మిర్రర్ : కేరళలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత ఆసుపత్రి యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వీడియో తొలగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన సదరు నేతను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సభ్యుడు, కన్నూర్ ఎంపీ కే. సుధాకరన్‌కు సన్నిహితుడైన సుహైల్ షాజహాన్ ఓ ప్రైవేట్ సంతానలేమి చికిత్స కేంద్రం యజమానిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

‘చంగాతికూట్టం’ అనే సోషల్ మీడియా పేజీలో ఆ క్లినిక్‌కు వ్యతిరేకంగా ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియోను తొలగించాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని క్లినిక్ యజమానిని డిమాండ్ చేశారు. లేదంటే మరిన్ని వీడియోలు విడుదల చేసి ఆసుపత్రికి నష్టం కలిగిస్తానని హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో క్లినిక్ యజమాని, డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. పెట్టా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలీసుల సూచన మేరకు డాక్టర్ డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో మంగళవారం క్లినిక్‌కు వచ్చిన సుహైల్ షాజహాన్ రూ.10 లక్షలు తీసుకుంటుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ అధిష్ఠానం బుధవారం సుహైల్ షాజహాన్‌పై చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆయన సాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్షీణించిన రాజకీయ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తాజా అరెస్ట్ ఆ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
also read : లొంగిపోవాలని వీడియో కాల్‌లో కోరినా వినలేదు.. ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు