Homeక్రైమ్అక్ర‌మ అండాల సేక‌ర‌ణ కేసులో ఒక‌రు అరెస్టు...!

అక్ర‌మ అండాల సేక‌ర‌ణ కేసులో ఒక‌రు అరెస్టు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: పేద మ‌హిళ‌ల‌కు ఆశ చూపి అక్ర‌మంగా అండాలు సేక‌రిస్తున్న కేసులో ఒక‌రిని జూబ్లీహిల్స్ పోలీసులు ఒక‌రిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. అక్ర‌మంగా అండాలు సేక‌రించిన కేసులో ఒయాసిస్ ఫెర్టిలిటి సెంట‌ర్ ప్ర‌తినిధి మూరేళ్ల న‌ర‌సింహారావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పేద మ‌హిళ‌ల‌కు డ‌బ్బుల ఆశ‌చూపి అండాల‌ను సేక‌రించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహారావును పోలీసులు విచారిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ వైద్యా , ఆరోగ్య శాఖ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బేగంపేట హాస్టల్‌లో ఉండే వివిధ రాష్ట్రాల్లోని మహిళల ద్వారా పలు సంతాన సాఫల్య కేంద్రాల నుంచి అండాలను సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ హాస్టల్‌పై వైద్యాధికారులు దాడులు జరిపి 12 మంది మహిళలకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. డీఎంహెచ్‌వో డా. పుట్ల శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు