Homeక్రైమ్పెళ్లైన తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమంటూ ఆరోపణలు!

పెళ్లైన తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమంటూ ఆరోపణలు!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదకర ఘటన వెలుగుచూసింది. వివాహమైన తొమ్మిది నెలలకే ఓ యువతి అత్తారింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. రుచి మిశ్రా అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రుచికి గోపాల్ మిశ్రాతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచే ఆమెకు అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రుచి రంగుపై భర్త తరచూ అవమానకర వ్యాఖ్యలు చేసేవాడని, అదనపు కట్నం తీసుకురావాలంటూ ఒత్తిడి చేసేవాడని తెలిపారు. అంతేకాకుండా చిన్నచిన్న విషయాలకే గొడవపడుతూ ఆమెపై దాడి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

తొమ్మిది నెలల వైవాహిక జీవితానికే ఈ విధంగా ముగింపు రావడంతో రుచి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, భర్తతో పాటు అత్తారింటి వేధింపుల కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రుచి మృతికి గల అసలు కారణాలు ఏమిటి? కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: వివాహేతర సంబంధం విషాదాంతం… రైలు కింద పడి మహిళ, ర్యాపిడో డ్రైవర్ ఆత్మహత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు