Homeతెలంగాణరామచంద్ర రావుది గొప్ప సాహసమే...!

రామచంద్ర రావుది గొప్ప సాహసమే…!

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ

  • రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్నగర్ స్థానం నుంచి బరిలోకి

  • గతంలో గెలుపు, ఓటములు

  • రిస్క్ అంటున్న విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికల సందడి మొదలైంది. మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు సైతం ఖాళీ అవుతున్నాయి. అంతటా ఆశావహుల సందడి కనిపిస్తోంది. మరోవైపు బిజెపి హై కమాండ్ సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అదే సమయంలో కొందరు యువనేతలు, ఆశావహులు ఈ టిక్కెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇటువంటి సమయంలో తాను నేరుగా బరిలోకి దిగాలని రామచందర్రావు ప్రయత్నిస్తుండడం హార్ట్ టాపిక్ అవుతోంది.

ఒకసారి మూడో స్థానానికి…

మరోవైపు ఈ పట్టభద్రుల స్థానం నుంచి ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బరిలో దిగుతుండడం చూస్తుంటే రిస్కు చేస్తున్నారేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యావంతులు, ఉద్యోగులు, మేధావి వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను నిలబెట్టేందుకు తానే సరైన అభ్యర్థి నన్న ధీమాతో ఆయన పావులు కదుపుతున్నారు. అయితే గతంలో ఈ స్థానంలో ఒకసారి ఓడిపోయిన చరిత్ర ఉంది. అదే సమయంలో సంచలన విజయం సైతం దక్కించుకున్నారు. కానీ ఒకసారి మాత్రం ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ఇటువంటి భిన్న ఫలితాలు చూసిన ఆయన.. ఇప్పుడున్న రాజకీయ సమీకరణలో మళ్లీ అక్కడి నుంచే పోటీకి దిగడం ఒకరకంగా పెద్ద రిస్క్ అని చెప్పవచ్చు.

ప్రభుత్వ వ్యతిరేకత పై నమ్మకం…

ఓటమి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నా.. ఈసారి విద్యావంతుల నాడి ప్రభుత్వ వ్యతిరేకత వైపు ఉందన్న అంచనాతో ఆయన బరిలోకి దిగేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే రామచంద్రరావు వ్యూహం వేరేలా ఉంది. రాష్ట్ర బిజెపి పగ్గాలు ఆయన చేతికి అనూహ్యంగా వచ్చాయి. ఎన్నికల ముంగిట కచ్చితంగా ఆయన మార్పు ఉంటుంది. దానిని అంచనా వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన బలాన్ని నిరూపించుకోవాలన్నది ఆయన వ్యూహంగా అర్థం అవుతుంది. అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉంటూనే ప్రత్యక్ష ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాలన్న ఆయన ఆలోచన పార్టీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది.

తేడా కొడితే అంతే…

బిజెపిలో చాలామంది యువనేతలు ఉన్నారు. వారంతా ఆశావహులుగా ఉండగా.. రామచంద్రరావు మాత్రం ఎంత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ బరిలోకి దిగి విజయం సాధిస్తే పార్టీ పై ఆయన పట్టు మరింత బలపడుతుంది. అదే సమయంలో ఫలితం తేడా కొడితే మాత్రం పార్టీ నాయకత్వ స్థానంలో ఆయన భవిష్యత్తుకే పెద్ద ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటూనే.. తనకున్న న్యాయవాద, విద్యావేత్తల నేపథ్యాన్ని నమ్ముకుని ఆయన ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. రామచంద్రరావు మాత్రం గొప్ప రిస్క్ తీసుకుంటున్నారు అనేది విశ్లేషకులు మాట. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ట్రంప్‌కు సవాళ్ల సుడిగుండం: రాజకీయ, దౌత్య రంగాల్లో వరుస పరాజయాలు
  2. హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ ప‌టంలో టీ-హ‌బ్‌తో ప్ర‌త్యేక గుర్తింపు…! కేటీఆర్‌…
  3.  గురువుపై అభిమానానికి హద్దుల్లేవు… రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం!
  4.  స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు