విభిన్నమైన కథలను, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. తాజాగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా బాలీవుడ్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటివరకు సాఫ్ట్ నేచర్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నిత్యామీనన్.. ఈసారి భిన్నమైన కోణంలో కనిపించనుండటం విశేషం.
అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. మరి నిత్యామీనన్ కొత్త పాత్రలో ఏ స్థాయిలో మెప్పిస్తారు? మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
also read: 28 ఏళ్ల తర్వాత వెండితెరపైకి డిస్కో శాంతి.. ‘బుల్లెట్టు బండి’తో గ్రాండ్ రీఎంట్రీ!
