HomeUncategorizedకస్తూర్బా పాఠశాలలో విషాదం.. పదో తరగతి విద్యార్థిని మృతి

కస్తూర్బా పాఠశాలలో విషాదం.. పదో తరగతి విద్యార్థిని మృతి

క్రైమ్ మిర్రర్ : సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందడం విషాదాన్ని నింపింది. తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దావులగల్ల లాస్య మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా సెలవుల అనంతరం లాస్య తిరిగి పాఠశాల హాస్టల్‌కు వెళ్లింది. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో లాస్యకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి గురించి పాఠశాల సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకోగా, అప్పటికే లాస్య ఆరోగ్యం క్షీణించినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే తమ కుమార్తె మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ బిడ్డ ఆకస్మికంగా మృతి చెందడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్

లాస్య మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లాస్య మృతదేహం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నట్లు సమాచారం. విద్యార్థిని మృతికి గల అసలు కారణాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
also read : ‘బ్యాలెట్’లోనూ హస్తం పరాభవమే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు