-
ఫౌండేషన్ పేరుతో భారీ ఈవెంట్లు, పండుగలు
-
కనీస అవగాహన లేని డైరెక్టర్లు, మండలాల ఇన్చార్జులు
-
గులాబీ పార్టీలో కర్చిఫ్ వేసే ప్రయత్నాలు
-
ఎంత మాత్రం అవకాశం ఇవ్వని మాజీలు
-
ఈఎల్వి భాస్కరుడి లీలలు ఎంత చెప్పినా తక్కువే..
క్రైమ్ మిర్రర్, మునుగోడు: రాజకీయం అంటేనే సేవ.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలి. అటువంటిది ప్రజలకు ముందుగానే సేవ రుచి చూపించి రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు లక్కీ భాస్కర్. దీనికిగాను పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇన్చార్జులను నియమించి.. సేవ ముసుగులో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మునుగోడు ఈ ఎల్ వి భాస్కర్. ఇదే పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సాంస్కృతిక, సంప్రదాయ, సేవల పేరుతో చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. దసరా పండుగలు, బతుకమ్మ ఈవెంట్లతో తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ ఈవెంట్లకు సేవలందిస్తున్న వారి విషయంలో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల్లో ఒక రకమైన భ్రమలు కల్పిస్తూ.. రాజకీయ పార్టీల అవసరాలకు అనుగుణంగా రంగులు మారుస్తూ.. సేవ ముసుగులో ఆ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నం, అక్రమాలు, రాజకీయ అత్యాశ, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటివి బయటకు వస్తున్నాయి. మునుగోడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.
సేవ పేరుతో రాజకీయ పునాదులు…
రాజకీయాల్లోకి రావడం అనేది ఎవరి ఇష్టం. తమ పరిస్థితికి అనుగుణంగా రాజకీయ అడుగులు వేస్తుంటారు. కానీ వ్యాపార రంగంలో సంపాదించిన సంపాదనతో.. రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ లక్కీ భాస్కర్ మాత్రం.. ఏకంగా సేవ ముసుగులో రాజకీయ పునాదులు నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అన్నింటిని రాజకీయం కోసమే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. వాస్తవానికి చెప్పాలంటే ప్రజలకు భరోసా కావాలి. ప్రచార చిత్రాలు ఎంత మాత్రం కాదు. కానీ ఈ లక్కీ భాస్కర్ కు మాత్రం అవేవీ పట్టవు. తాను రాజకీయంగా ఎదిగేందుకు ప్రజలకు చిన్నపాటి ఆనందాలు ఇచ్చి.. తాను మాత్రం పెద్ద రాజకీయ ఆనందం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
బలవంతపు జన సమీకరణ…
మునుగోడు లో తన బలం ఇది అని చెప్పేందుకు లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హడావిడి చేస్తారో తెలియంది కాదు. జనాన్ని ఎలా తేవాలో తెలుసు. జనాన్ని ఎలా పోగు చేయాలో తెలుసు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని మునుగోడు తెస్తానంటారు. సీఎం రేవంతును సైతం ఇట్టే రప్పిస్తానని చెబుతారు. కెసిఆర్ తన సన్నిహితుడు అని చెప్పుకుంటారు. భారీ మొత్తంలో సభలు.. భారీ సెట్టింగ్ లతో ఈవెంట్లు అన్ని ఇతగాడి సొంతం. అసలు ఆయనకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫౌండేషన్ కు నిధులు ఎలా సమకూరుతున్నాయి? దాని వెనుకున్న కథ ఏంటి? ఆ ఫౌండేషన్ ఇప్పటి వరకు ఎంతమందిని ఆదుకుంది? ఎంతమంది సాయం పొందారు అంటే దానికి సమాధానం కరువవుతోంది. కనీసం స్పందించేవారు లేకుండా పోతున్నారు.
గతంలోనూ ఇలాంటి నేత…
మునుగోడు కు లక్కీ భాస్కర్ లాంటి నేతలు కొత్త కాదు. గతంలో ఇలాంటి నేతలు డబ్బుల మూటలతో వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కనుమరుగయ్యారు. ఇప్పుడు కూడా లక్కీ భాస్కర్ అలానే తన అక్రమ, సక్రమ సంపాదనతో అడుగుపెట్టారు. ఏకంగా మునుగోడు నియోజకవర్గంలో ఏజెంట్లను పెట్టుకొని భారీ ఈవెంట్లకు తెగ పడుతున్నారు. ఫ్లోరోసిస్ బాధితులు అంటున్నారు.. శివన్న గూడెం ప్రాజెక్టు అంటున్నారు.. అసలు ఆ ప్రాజెక్టు ఏంటి? నిర్వాసితులు ఏంటి అనేది నిజంగా ఆయనకు తెలియదు. పోనీ ఫౌండేషన్ డైరెక్టర్లు, ప్రతినిధులు ఎవరో తెలియదు. కనీస అవగాహన లేని వారిని ఫౌండేషన్ లో పెట్టుకుని సేవ లక్ష్యాన్ని ఎలా చేయగలరు. జాతీయస్థాయిలో వారు తెలుసు.. రాష్ట్రస్థాయిలో వీరు తెలుసు అన్న లక్కీ భాస్కర్ సభకు కనీసం మాజీ ప్రజాప్రతినిధులు కూడా రాలేదు అంటే ఆయన స్థాయి అర్థం అవుతోంది. గులాబీ పార్టీ నాయకత్వాన్ని పిలిచి.. ఇదిగో నా బలం అని చూపించే ప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. చివరకు దసరా సభలకు, బతుకమ్మ ఈవెంట్లకు.. తన సభలకు జనాలను తరలించే ఆటోలకు కిరాయి కూడా ఇవ్వలేదు. కానీ ఫౌండేషన్ పేరుతో భారీగా డబ్బు ఉందని.. తనకు ప్రజాసేవ పట్ల లక్ష్యం ఉందని చెప్పుకునే ఈ లక్కీ భాస్కర్ చుట్టూ కూడా.. అటువంటి భజన బృందమే చేరింది. ఇలాంటి వాటితో ఆయన అనుకున్న రాజకీయ మనుగడ అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
సైబర్ నేరం సాదారణ నేరం కాదు…! నేరగాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందే…! సుప్రీం కోర్టు…
-
తెలంగాణలో బీజేపీ సంచలనం…! హైదరాబాద్లో అమిత్షా మహా పాదయాత్ర…
-
ఆర్నబ్ తుఫాన్ బీభత్సం…! చిగురుటాకులా వణికిన ఏపీ…
-
బెజవాడలో వార్ వన్ సైడ్..! ప్రచారంలోనూ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ…
