Homeఆంధ్ర ప్రదేశ్ఆర్నబ్ తుఫాన్ బీభత్సం...! చిగురుటాకులా వణికిన‌ ఏపీ...

ఆర్నబ్ తుఫాన్ బీభత్సం…! చిగురుటాకులా వణికిన‌ ఏపీ…

  • గోదావరి జిల్లాలపై పెను ప్రభావం

  • వణికిపోయిన ఉత్తరాంధ్ర

  • విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం

  • సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ పై ఆర్నబ్ తుఫాను విరుచుకుపడింది. బీభత్సం సృష్టించింది. ఉత్తరాంధ్రతోపాటు కోస్తాంధ్ర జిల్లాలపై పంజా విసిరింది. తుఫాను ప్రభావంతో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బీకర గాలులు విచాయి. ఈ దెబ్బకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు పడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. పునరుద్ధరించే పనిలో విద్యుత్ శాఖ ఉంది. మరోవైపు ఏపీకి విపత్తు వేళ తెలంగాణ సాయాన్ని అర్థించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన అదనపు సిబ్బందిని, విద్యుత్ సామాగ్రిని అందించాలని కోరారు. ఏపీకి అండగా నిలిచేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ముందుకు వచ్చింది. అవసరమైన సిబ్బందిని, సామాగ్రిని పంపించేందుకు అంగీకరించింది.

తీరం దాటిన తుఫాన్…

మరోవైపు తుఫాను తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటి ప్రక్రియ పూర్తయిందని.. అతి తీవ్ర తుఫాను తీవ్ర తుఫానుగా బలహీన పడినట్లు తెలిపారు. తీరం దాటిన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణాజిల్లా వరకు భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు తుఫాను సహాయ చర్యలపై సమీక్షించారు. బుధవారం ఉదయం 6 గంటల తర్వాత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు రేపటి వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఆర్టిజిఎస్ అధికారులు సీఎంకు వెల్లడించారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో సుమారు 6000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ఆ జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు…

తుఫాను ప్రభావం ప్రధానంగా గోదావరి జిల్లాలపై ప్రతాపం చూపింది. చిగురుటాకుల వణికిపోయాయి ఉభయ గోదావరి జిల్లాలు. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం దాటికి గడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లావేరు, రణస్థలం, పొందూరు, జి సిగడాం మండలాల్లో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంశధార నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గొట్టా బ్యారేజీ వద్ద నీతిని కిందకు విడిచి పెడుతున్నారు. మరోవైపు విజయనగరంలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు కావడం విశేషం. జిల్లా వ్యాప్తంగా నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విశాఖలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులు, కాలనీలు, లోతస్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి. గోదావరి జిల్లాలో పరిస్థితి చెప్పనవసరం లేదు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు