Homeక్రైమ్భారీ దోపిడి...! క‌ళ్ల‌లో పెప్ప‌ర్ స్ర్పే కొట్టి 21ల‌క్ష‌ల తో ఉడాయింపు...!

భారీ దోపిడి…! క‌ళ్ల‌లో పెప్ప‌ర్ స్ర్పే కొట్టి 21ల‌క్ష‌ల తో ఉడాయింపు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఓ వ్య‌క్తి వ‌ద్ద నుంచి కొంద‌రు వ్య‌క్తులు భారీ దోపిడికి పాల్ప‌డ్డారు. క్రిప్టోక‌రెన్సీగా మార్చి ఇస్తామంటూ ఓ వ్య‌క్తిని న‌మ్మించి అత‌ని వ‌ద్ద ఉన్న 21ల‌క్ష‌ల‌ను లాక్కొని ప‌రారైన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి బ‌జార్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటేటర్‌గా ఎర్రగడ్డ మోతీనగర్‌కు చెందిన అమరేంద్ర పనిచేస్తున్నాడు. తన వద్ద ఉన్న రూ. 25 లక్షలను క్రిప్టోకరెన్సీగా మార్చాలని అమరేంద్రను జూబ్లీహిల్స్‌కు చెందిన షానవాజ్ కోరాడు.

స్నేహితులు విజయ్‌కుమార్, అమర్‌కుమార్‌ల సలహాతో నాంపల్లి బజార్ ఘాట్‌లోని బినాన్స్ వాలెట్ కార్యాలయానికి అమరేంద్ర వెళ్లాడు. ఈ ఆఫీసులో సుమేర్, సయ్యద్ పేర్లతో ఇద్దరు వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.25 లక్షలకు క్రిప్టోకరెన్సీ కావాలని అమరేంద్ర కోరాడు. ముందుగా నగదు చూపించాలని నిందితులు అడిగారు. నగదు చూపించగానే ఒక్కసారిగా అమరేంద్ర కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి దాడికి పాల్పడ్డారు. అమరేంద్ర వద్ద ఉన్న రూ.25 లక్షలను లాక్కొని పరారయ్యేందుకు నిందితులు యత్నించారు. వారిని పట్టుకునేందుకు విజయ్‌కుమార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నిందితుల చేతుల్లో నుంచి రూ.4 లక్షలు కిందపడ్డాయి. మిగిలిన రూ.21 లక్షలతో వారు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ముంబై నిరసనలో అమీర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదుకు బీజేపీ నేత సిద్ధం!
  2. రజనీకాంత్‌పై అభిమానం.. 230కి పైగా పాత్రలతో బొమ్మల కొలువు! మధురైలో ప్రత్యేక ఆకర్షణగా సూపర్‌స్టార్ ఆలయం
  3.  ‘ఏఏ23’పై లోకేశ్ కనగరాజ్ కీలక అప్డేట్.. అల్లు అర్జున్ అభిమానుల్లో మళ్లీ పెరిగిన అంచనాలు!
  4. ” నాకు ‘బాహుబలి’ కాదు.. ఆ సినిమానే ప్రత్యేకం”- రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు