Homeతెలంగాణనాణ్య‌మైన క‌రెంటు ఇవ్వాలి...! బెల్లంప‌ల్లి స‌బ్‌స్టేష‌న్ ఎదుట రైతుల నిర‌స‌న‌...

నాణ్య‌మైన క‌రెంటు ఇవ్వాలి…! బెల్లంప‌ల్లి స‌బ్‌స్టేష‌న్ ఎదుట రైతుల నిర‌స‌న‌…

బెల్లంప‌ల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌: జిల్లాలోని రైతాంగానికి రాష్ర్ట ప్ర‌భుత్వం 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం బెల్లంప‌ల్లిలోని శివాల‌యం ఎదుటు రైతులు బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బెల్లంప‌ల్లి మండ‌లంలోని బ‌ట్వాన్‌ప‌ల్లి స‌ర్పంచ్ సింగ‌తి రాజేశ్‌, పెర్క‌ప‌ల్లి మాజీ కో ఆప్ష‌న్ స‌భ్యుడు రామ‌గోని అశోక్‌గౌడ్‌, రైతు సంఘం నాయ‌కులు సింగ‌తి ర‌వి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. అస‌లే వ‌ర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొటున్న రైతుల‌కు విద్యుత్ స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తుంద‌న్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు.

విద్యుత్ ఎప్పుడు వ‌స్తుందో…ఎప్పుడు పోతుందో తెలియ‌క రైతులు అయోమ‌యంలో ఉన్నార‌న్న‌రు. నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక వేసిన పంట‌లు ఎండిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌ర‌ఫ‌రా చేస్తున్న విద్యుత్‌లో హెచ్చు, త‌గ్గుద‌ల‌తో మోటార్లు కాలిపోయి తీవ్ర‌మైన న‌ష్టాన్ని రైతులు ఎదుర్కొంటున్న‌ర‌ని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని, లేనిపక్షంలో రానున్న కాలంలో పోరాటాన్ని ఉధృతం చేయడమే కాకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్య‌క్ర‌మంలో బట్వాన్ పల్లి, పెర్కపల్లి, దుగ్నేపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  “ది డర్టీ పిక్చర్ 2″పై నిర్మాత ఏక్తా కపూర్ భారీ అప్‌డేట్.. ఈసారి కథానాయిక ఎవరు
  2. ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి, మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్!
  3.  డ్యాన్సర్ హిమశ్రీ బోరో మృతి కేసులో సంచలన ఆరోపణలు.. ఈవెంట్ మేనేజర్‌పై అనుమానాలు!
  4.  గుంటూరులో దారుణం.. యాచకురాలిపై అత్యాచారయత్నం.. రౌడీషీటర్ అరెస్ట్!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు