Homeతెలంగాణద‌ర్శ‌కుడు త్రినాథ‌రావుపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...! అస‌లు ఏం జ‌రిగిందంటే...

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావుపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…! అస‌లు ఏం జ‌రిగిందంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌పై న‌టి నీతిటేల‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో టాలీవుడ్‌లో వైర‌ల్‌గా మారాయి. త‌న‌కు తొలి సినిమాలో జ‌రిగిన చేదు అనుభ‌వ కార‌ణంగానే టాలువుడ్‌కు దూర‌మైన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ‘మేం వయసు వచ్చాం’ సినిమాలో నటించిన ఉత్తరాది భామ నీతి టేలర్ గుర్తుందా? ఆ తర్వాత సంవత్సరం ‘పెళ్ళిపుస్తకం’లోనూ నటించింది. ఇక ఆమె నటించిన చివరి తెలుగు సినిమా ‘లవ్ డాట్‌ కామ్’. ఇంతకూ విషయం ఏమంటే… తన తొలి చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన మీద నీతి టేలర్ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తొలి చిత్రం సమయంలో తనతో బాగానే ఉన్న ఈ దర్శకుడు మరో సినిమాకు ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్‌ మెంట్‌ కు అంగీకరించాలన్నడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నీతి టేలర్ తెలిపింది.

31 సంవత్సరాల నీతి టేలర్‌ 2012లో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించింది. బెక్కెం వేణు నిర్మించిన ఈ సినిమాను త్రినాథ రావు నక్కిన తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు అదే మొదటి సినిమా. తనీశ్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నీతి టేలర్ కు తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. వెంటనే రాహుల్ రవీంద్రన్ సరసన ‘పెళ్ళిపుస్తకం’లో నటించింది. అయితే తొలి చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఎదురైన చేదు అనుభవంతో తాను తెలుగు సినిమా రంగానికి దూరమైపోయాయని, అప్పటి నుంచి మరే తెలుగు సినిమా చేయలేదని తెలిపింది. నటనకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకు సమాధానంగా ఆ ఇంటర్వ్యూలో ఆమె ఈ కాస్టింగ్ కౌచ్ వివరాలు తెలిపింది.

బాలనటిగా బుల్లితెరపై మెరిసిన నీతి టేలర్ మ్యూజిక్‌ ఆల్బమ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు ఆమెకు వచ్చాయి. అయితే సినిమాలకంటే టీవీ రంగానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. నటిగా లైమ్ లైట్‌లో ఉండగానే 2020లో బోయ్ ఫ్రెండ్‌ పరీక్షిత్‌తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి అడపాదడపా మ్యూజిక్‌ వీడియోస్ మాత్రం చేస్తోంది. మరి నీతి టేలర్‌ చేసిన ఈ ఆరోపణలపై త్రినాథ రావు నక్కిన ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి, మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్!
  2. ఢిల్లీలో నిరసనలకు బ్రేక్‌.. జంతర్ మంతర్‌లో ధర్నాలపై పోలీసుల కీలక నిర్ణయం!
  3.  డ్యాన్సర్ హిమశ్రీ బోరో మృతి కేసులో సంచలన ఆరోపణలు.. ఈవెంట్ మేనేజర్‌పై అనుమానాలు!
  4.  గుంటూరులో దారుణం.. యాచకురాలిపై అత్యాచారయత్నం.. రౌడీషీటర్ అరెస్ట్!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు