Homeతెలంగాణఖైరతాబాద్ లో మహిళల కే ఛాన్స్...!

ఖైరతాబాద్ లో మహిళల కే ఛాన్స్…!

  • చింతల రామచంద్రారెడ్డిని పక్కన పెట్టనున్న బిజెపి

  • ఫైర్ బ్రాండ్ మాధవి లత వైపు మొగ్గు

  • ఇంకోవైపు పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి పేరు

  • అనూహ్యంగా తెరపై నటి జీవిత

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఖైరతాబాద్ లో బలమైన అభ్యర్థి కోసం బిజెపి అన్వేషిస్తోందా? ఈసారి చింతల రామచంద్రారెడ్డికి సీటు డౌటేనా? పరిశీలనలో ఫైర్ బ్రాండ్ మాధవి లత పేరు ఉందా? లేకుంటే దివంగత పిజిఆర్ కూతురు విజయా రెడ్డికి పార్టీలోకి పిలిచి టిక్కెట్ ఇస్తారా? లేకుంటే నటి జీవితకు అవకాశం దక్కుతుందా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే ప్రచారం నడుస్తోంది.

అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ మరోసారి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అటు గులాబీ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించనుంది. దీంతో బిజెపి సైతం సరైన అభ్యర్థిని పోటీలో పెట్టాలని భావిస్తోంది.

  • ప్రతిష్టాత్మకంగా..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో మూడో ప్లేస్ కు పరిమితం అయిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది.

అందుకే ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీకి సిద్ధమవుతున్న చింతల రామచంద్రారెడ్డికి ఈసారి షాక్ తప్పేలా లేదు.

గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడం.. వయోభారం తో బాధపడుతుండడంతో పక్కన పెట్టాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాస్ లీడర్ గా పేరు ఉన్న దానం నాగేందర్ ను ఓడించడానికి అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి కోసం కాషాయ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

  • ఫైర్ బ్రాండ్ మాధవి లత..

ఖైరతాబాద్ నుంచి మహిళ అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేది హై కమాండ్ అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రధానంగా ఫైర్ బ్రాండ్ మాధవి లత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేశారు.

గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఆపై పార్టీ విధానాలతో పాటు సమకాలిన అంశాలపై దూకుడుగా వ్యవహరిస్తుంటారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో హిందూ ఓట్లను సమీకృతం చేస్తే ఆమె విజయం సునాయాసం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆమె వైపు బిజెపి హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

  • విజయా రెడ్డి పై ఆశలు..

మరోవైపు దివంగత జనార్దన్ రెడ్డి కుమార్తె విజయ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. పిజేఆర్ కుమార్తె గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. పైగా దానం నాగేందర్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

ఒకవేళ ఆమెకు టిక్కెట్ దక్కకపోతే.. బిజెపిలోకి రప్పించి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నుంచి పలుమార్లు పి.జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కుటుంబానికి ఇక్కడ మంచి పేరు ఉంది.

దానిని వాడుకోవాలని చూస్తోంది బిజెపి. ఇంకోవైపు నటి జీవిత పేరు కూడా తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా జీవిత దంపతులు బిజెపిలోనే కొనసాగుతూ వస్తున్నారు.

ఆమెకు టిక్కెట్ ఇస్తే సినీ గ్లామర్ సైతం పనిచేసి విజయం సాధించే అవకాశం ఉందని హై కమాండ్ అంచనా వేస్తోంది. ఈ ముగ్గురు మహిళ నేతల్లో ఒకరికి బిజెపి టికెట్ ఖాయమని సమాచారం. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు