హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం …లేకుంటే రాజ్యాంగ సంస్థలపై దుష్ర్పచారామా అంటూ కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌గాంధీ విచిత్రమై వ్యవహారా శైలిలో మాట్లాడుతున్నారని ఆయనలో ప్రమాదకర దోరణి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా తీర్పును గౌరవించే అలవాటు లేదని వ్యంగంగా అన్నారు. రాజ్యాంగ సంస్థల విశ్వాసనీయతను దెబ్బతీయడే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలు అవినీతి మాయమయ్యాయని ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం, కాగ్, న్యాయవ్యవస్థ, పార్లమెంటు తమ రాజకీయ ప్రయోజనాలు అనుగుణంగా వ్యవహరించ లేదనే కారణంతో ఆయా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర మంత్రి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడ చదవండి:
- పవన్ కల్యాణ్ పేరుతో నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్
-
హైదరాబాద్‌లో బైక్ స్టంట్లతో రెచ్చిపోయిన యువకులు.. ముగ్గురి అరెస్ట్
-
నానా పటేకర్ మృతి.. తీవ్ర భావోద్వేగంలో రామ్ గోపాల్ వర్మ
-
24 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో భార్య ఓటు తొలగింపునకు దరఖాస్తు…
