Homeజాతీయంఈ నెల 10న ఢిల్లీలో ఆందోళ‌న‌కు సీజేపీ పిలుపు...! కేంద్రం అప్ర‌మ‌త్తం...

ఈ నెల 10న ఢిల్లీలో ఆందోళ‌న‌కు సీజేపీ పిలుపు…! కేంద్రం అప్ర‌మ‌త్తం…

  • ఢిల్లీ న‌గ‌రంలో హైఅల‌ర్ట్‌…

  • భారీ పోలీసు బ‌ల‌గాల మోహ‌రింపు…

  • విధుల‌కు వెళ్లేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచ‌న‌…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 10 జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మై ఢిల్లీన‌గ‌రంలో హైల‌ర్ట్ ప్ర‌క‌టించింది. న‌గ‌ర వ్యాప్తంగా భారీ పోలీసు బ‌ల‌గాల‌తో క‌ట్టుదిట్టం చేసి భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌ను మోహ‌రించింది. చ‌త్తీష్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్ నుంచి దాదాపు 7వేల మంది సీఆర్ ఎఫ్ సిబ్బందిని ఢిల్లీకి త‌ర‌లించారు. ఢిల్లీ వ్యాప్తంగా 20 వేలకు పైగా పోలీసు, పారా మిలటరీ బలగాలతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఏమైనా అల్లర్ల జరిగితే.. గుంపులను చెదరగొట్టేందుకు యాంటీ రైట్ ఆయుధాలతో బలగాలు రంగంలోకి దింపారు. అంతేగాకుండా త‌న ప‌ర్య‌ట‌ల‌ను ర‌ద్దు చేసుకొని కేంద్ర‌మం్ర‌తి హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. శనివారం సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. జంతర్ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టనున్న నిరసనకు అనుమతిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. ఆందోళనకు అనుమతి లేదని సీజేపీకి ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉందని తెలిపారు. అంతేగాకుండా ఎవ‌రైన నిర‌స‌న‌ల పేరుతో సోష‌ల్‌మీడియాలో త‌ప్పుడు స‌మాచారం ఇస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి…డీసీపీ సృష్టి పాండే…

శనివారం సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీసీపీ సృష్టి పాండే సూచించారు. విధులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన వద్దని ప్రజలకు తెలిపారు. మీ భద్రతతోపాటు కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఢిల్లీ నగరంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ‘భారతీయుడు 3’పై కొనసాగుతున్న ఉత్కంఠ.. థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీకి వెళ్తుందా?
  2.  ఫోన్ దొంగతనం.. పాస్‌వర్డ్ కోసం దొంగే మెసేజ్! డెహ్రాడూన్‌లో షాకింగ్ ఘటన
  3.  జాన్వీ కపూర్ ‘చుట్టమల్లె’ వీడియోపై ఫేక్ న్యూస్.. స్పందించిన సీపీ సజ్జనార్
  4.  పవన్ కల్యాణ్ పేరుతో నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు