ఏపీ–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని భద్రాద్రి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో కలుషిత నీరు తాగినట్లు భావిస్తున్న 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలోని తాగునీటి ట్యాంక్‌లో బల్లి పడి మృతి చెందినట్లు సమాచారం. శనివారం ఆ ట్యాంక్‌లోని నీటిని తాగిన కార్మికుల్లో కొందరికి వాంతులు, తలనొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి చికిత్స కొనసాగిస్తున్నారు.
మిగిలిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మొత్తం 12 మందినీ 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది.
కాగా, తాగునీటి ట్యాంక్‌లో బల్లి పడటం వల్లే కార్మికులు అస్వస్థతకు గురయ్యారా? లేదా నీటిలో మరేదైనా కలుషితం జరిగిందా? అనే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అధికారులు నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత కార్మికుల అస్వస్థతకు అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
also read: వరద బాధితులకు సాయం చేస్తుండగా విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ప్యాకెట్‌తో వ్యక్తి మృతి
