Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమ పేరుతో ఘాతుకం.. కత్తి దాడిలో 19 ఏళ్ల యువతి మృతి

ప్రేమ పేరుతో ఘాతుకం.. కత్తి దాడిలో 19 ఏళ్ల యువతి మృతి

క్రైమ్ మిర్రర్ : విజయవాడలో యువతిపై జరిగిన కత్తి దాడి విషాదాంతమైంది. న్యూ రాజరాజేశ్వరి పేటలో శనివారం 19 ఏళ్ల యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు యువతిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆమె కేకలు విని కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునే సరికి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

యువతికి శరీరంపై మూడు చోట్ల కత్తి గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మరోవైపు దాడి అనంతరం యువకుడు సమీపంలోని భవనం పై నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతడు కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. యువతి మృతితో న్యూ రాజరాజేశ్వరి పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : అమరావతి రైతులకు తీపి కబురు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు