Homeతెలంగాణమాదాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్ల పై పోలీసుల నిఘా!

మాదాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్ల పై పోలీసుల నిఘా!

క్రైమ్ మిర్రర్,మాదాపూర్:-నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న సర్వీస్ అపార్ట్‌మెంట్లపై మాదాపూర్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత రెండు మూడు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ కే.వి. సుబ్బారావు తెలిపారు.
సర్వీస్ అపార్ట్‌మెంట్ల పేరుతో కొన్ని అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని బర్త్‌డే పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన రెండు కేసులు, వ్యభిచారానికి సంబంధించిన ఒక కేసు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

వియ‌త్నాంలో రోడ్డు ప్ర‌మాదం…! ఇద్ద‌రు భార‌తీయ యోగ‌శిక్ష‌కుల మృతి…

అపార్ట్‌మెంట్ యజమానులు అద్దెకు ఇచ్చే సమయంలో అద్దెదారుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ అవసరంతో అపార్ట్‌మెంట్ తీసుకుంటున్నారనే వివరాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సర్వీస్ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ కే.వి సుబ్బారావు హెచ్చరించారు. అవసరమైతే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి సంబంధిత అపార్ట్‌మెంట్లను సీజ్ చేయించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ఓయూ పరిధిలో రోడ్డు ప్రమాదం.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు