Homeవైరల్కుమార్తె జ్ఞాపకార్థం తండ్రి అపురూప కానుక.. రూ.2 లక్షలతో గుడి నిర్మాణం

కుమార్తె జ్ఞాపకార్థం తండ్రి అపురూప కానుక.. రూ.2 లక్షలతో గుడి నిర్మాణం

కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమకు హద్దులు ఉండవని మరో ఘటన నిరూపించింది. కన్న కూతురు దూరమైనా.. ఆమె జ్ఞాపకాలను ఎప్పటికీ తమ మధ్యే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఓ తండ్రి చేసిన పని అందరి మనసులను కదిలిస్తోంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్‌కు ఓ కుమార్తె ఉంది. అయితే 2024లో మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో అతని 13 ఏళ్ల కుమార్తె మృతి చెందింది. చిన్న వయసులోనే కుమార్తెను కోల్పోవడంతో రమేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కుమార్తెను మరచిపోలేకపోయిన రమేష్.. ఆమె జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి తన కుమార్తె జ్ఞాపకార్థం ఒక చిన్న గుడిని నిర్మించారు.

ఆ ఆలయంలో ప్రతిరోజూ దీపారాధన చేస్తూ కుమార్తెను స్మరించుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో పూజలు నిర్వహిస్తూ ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తన కుమార్తె భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తమతోనే ఉండాలనే తండ్రి భావోద్వేగం స్థానికులను కదిలిస్తోంది.

కుమార్తెపై తండ్రి చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమ, ఆమె జ్ఞాపకాలను నిలుపుకునేందుకు నిర్మించిన చిన్న ఆలయం గురించి తెలిసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు.

also read: జగిత్యాలలో ఏసీబీ వలలో సీడీపీవో.. 21 మంది సూపర్‌వైజర్ల నుంచి రూ.63 వేల లంచం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు