క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIRలో భాగంగా ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల విచారణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న మొత్తం 44,24,411 మంది ఓటర్లపై EC పరిశీలన జరిపింది. వీరిలో ఏకంగా 42,01,092 మందిని అర్హులైన ఓటర్లుగా గుర్తించగా, 1,66,279 మందిని అనర్హులుగా నిర్ధారించింది.ప్రస్తుతం మరో 57,040 మంది ఓటర్ల ఆధారాలు ఇంకా పరిశీలనలో ఉండగా, 4,434 మంది విచారణ పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం-6 దరఖాస్తులు 85,736, అలాగే ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వచ్చిన ఫారం-8 దరఖాస్తులు 40,991 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులు మరియు పెండింగ్ విచారణలన్నీ త్వరలో పూర్తి చేసి, అక్టోబర్ 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.
కుమార్తె జ్ఞాపకార్థం తండ్రి అపురూప కానుక.. రూ.2 లక్షలతో గుడి నిర్మాణం
జగిత్యాలలో ఏసీబీ వలలో సీడీపీవో.. 21 మంది సూపర్‌వైజర్ల నుంచి రూ.63 వేల లంచం!
