Homeసినిమానరసింహరాజు ఆసక్తికర విషయాలు.. ఆ విషయంలో అలా చేసి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యలు!

నరసింహరాజు ఆసక్తికర విషయాలు.. ఆ విషయంలో అలా చేసి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యలు!

1970–80ల కాలంలో తెలుగు సినిమాల్లో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరసింహరాజు. అప్పట్లో ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ‘తూర్పు పడమర’, ‘జగన్మోహిని’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరసింహరాజు తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా రంగంలో తనకు ఎదురైన అనుభవాలతో పాటు.. గతంలో తాను పాటించిన పద్ధతి వల్ల కొన్ని అవకాశాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు.

తాను మొదటి నుంచి తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడినని నరసింహరాజు తెలిపారు. సినిమా పరిశ్రమలోని ఇతర వ్యక్తులతో పెద్దగా టచ్‌లో ఉండేవాడిని కాదని, ఆ విషయం తనకు తర్వాత మైనస్‌గా అనిపించిందని చెప్పారు. ప్రస్తుతం తనలో చాలా మార్పు వచ్చిందని.. ఇప్పుడు తానే స్వయంగా అందరికీ ఫోన్ చేసి పలకరిస్తూ మాట్లాడుతున్నానని వెల్లడించారు.

గతంలోనే తాను దర్శకులు, నిర్మాతలతో సన్నిహితంగా ఉంటూ టచ్‌లో ఉండి ఉంటే తన కెరీర్ మరింత భిన్నంగా ఉండేదేమోనని అనిపిస్తుంటుందని నరసింహరాజు పేర్కొన్నారు.

తన కెరీర్ తొలి దశలోనే పలువురు ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆ దర్శకుల వద్ద పనిచేసిన కొందరు తర్వాతి కాలంలో స్వతంత్రంగా దర్శకులుగా మారారని తెలిపారు. అయితే ఆ తర్వాతి తరానికి చెందిన రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకుల సినిమాల్లో మాత్రం తాను నటించలేకపోయానని చెప్పారు.

వారితో తాను టచ్‌లో లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని నరసింహరాజు అభిప్రాయపడ్డారు. తాను వారితో సన్నిహితంగా పరిచయాలు కొనసాగించి ఉంటే తప్పకుండా వారి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చి ఉండేదని అన్నారు.

ఇక తన కుమారుడికి కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉండేదని నరసింహరాజు వెల్లడించారు. అయితే తానే అందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు కెనడాలో స్థిరపడి సంతోషంగా జీవిస్తున్నాడని తెలిపారు.

సినీ పరిశ్రమలో ప్రతిభతో పాటు పరిచయాలు, సంబంధాలను కొనసాగించడం కూడా కొన్ని సందర్భాల్లో అవకాశాలపై ప్రభావం చూపుతాయని తన అనుభవం ద్వారా నరసింహరాజు చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

also read: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకి చేదు అనుభవం.. నాలుగు గంటలు మానసిక వేదన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు