మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన యువకుడు.. బాలికను హోటల్‌కు తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ ఖత్వాని అనే యువకుడు సెప్టెంబర్ 22న విద్యార్థినిని కలవాలని పిలిచాడు. అనంతరం ఆమెను బెదిరిస్తూ, తమ మధ్య ఉన్న అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత బాలికను ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై బాధితురాలు సెప్టెంబర్ 24న పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
బాలికను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, బెదిరింపులకు పాల్పడి ఈ ఘటనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
also read: నకిలీ బాబా దారుణం.. జాతక దోషం పేరుతో బాలికపై అత్యాచారం
