గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతిమణి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ యాజమాన్యంలో మరో అత్యంత కీలకమైన బాధ్యతలను చేపట్టనున్నారు. అపోలో హాస్పిటల్స్ ‘డైరెక్టర్-ప్రాజెక్ట్స్’గా ఆమె నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నూతన పదవి ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ నెట్‌వర్క్ అభివృద్ధి, విస్తరణ మరియు ప్రాజెక్టుల గ్రోత్‌కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించనున్నారు.
చైనా, అమెరికాల మధ్య శత్రుత్వం వద్దు.. భాగస్వాములుగా ముందుకు సాగాలి: జిన్‌పింగ్
ప్రస్తుతం ఉపాసన అపోలో సంస్థలో ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ (CSR) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో తనదైన శైలిలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె, ఇప్పుడు నేరుగా సంస్థ బిజినెస్ ప్రాజెక్టుల విస్తరణ దిశగా కీలక బాధ్యతలు తీసుకోనున్నారు.దేశీయ వైద్య ఆరోగ్య రంగంలో తమ సేవా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు అపోలో గ్రూప్ భారీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా అపోలో హెల్త్‌కేర్ నెట్‌వర్క్ విస్తరణ కోసం ఏకంగా రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇంతటి భారీ స్థాయిలో బిజినెస్ విస్తరణ కార్యక్రమాలు చేపట్టబోతున్న తరుణంలో, ఉపాసనకు ఈ కీలకమైన ‘డైరెక్టర్-ప్రాజెక్ట్స్’ పదవిని కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
