Homeఆంధ్ర ప్రదేశ్షర్మిల ఇంట పెళ్లి సందడి...! తెలంగాణ‌ సీఎం రేవంత్ హాజరు...

షర్మిల ఇంట పెళ్లి సందడి…! తెలంగాణ‌ సీఎం రేవంత్ హాజరు…

  • హైదరాబాద్‌ శివారులో అంజిలి రెడ్డి–సోమల రఘురామ్‌ రెడ్డి నిశ్చితార్థం

  • సతీసమేతంగా వేడుకకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

  • రాజకీయ, సినీ, కుటుంబ ప్రముఖుల మధ్య వైభవంగా కార్యక్రమం

  • నవంబర్‌ 25న వివాహం.. డిసెంబర్‌ 5న రిసెప్షన్‌ నిర్వహణ

 

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: వైఎస్‌ షర్మిల కుటుంబంలో పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టింది. ఆమె కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్‌ రెడ్డి నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌ శివారులోని కొత్వాల్‌గూడలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

సతీసమేతంగా వచ్చిన సీఎం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సతీసమేతంగా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. అంజిలి రెడ్డి, రఘురామ్‌ రెడ్డిలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన వేడుకలో కాబోయే వధూవరులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో షర్మిల నివాసంలో పెళ్లి సందడి మొదలైనట్టయింది.

ఇప్పటికే పెళ్లి తేదీలు ప్రకటన…

కుమార్తె వివాహానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను షర్మిల ఇప్పటికే వెల్లడించారు. సెప్టెంబర్‌ 24న నిశ్చితార్థం, నవంబర్‌ 25న వివాహం, డిసెంబర్‌ 5న రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు ఆమె గతంలో ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. వివాహ ఆహ్వాన కార్యక్రమాల్లో భాగంగా తొలి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

రాజకీయ చర్చలకు షర్మిల స్పష్టత…

మరోవైపు, కుమార్తె వివాహానికి ఆహ్వానం ఇచ్చేందుకు తన సోదరుడు, వైఎస్‌ జగన్‌ను కలవనున్న అంశంపై వచ్చిన రాజకీయ ఊహాగానాలపైనా షర్మిల స్పందించారు. వివాహానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని ఆమె స్పష్టం చేశారు. వివాహ ఆహ్వానాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. ఇది పూర్తిగా కుటుంబ వేడుకేనని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంజిలి రెడ్డి నిశ్చితార్థ వేడుకలో రాజకీయ ప్రముఖుల హాజరు ప్రత్యేకంగా నిలిచింది.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. చైనా, అమెరికాల మధ్య శత్రుత్వం వద్దు.. భాగస్వాములుగా ముందుకు సాగాలి: జిన్‌పింగ్
  2. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం ఎలా? రాజ్యాంగ నిబంధనలు ఇవే!
  3. ఇందిరా గాంధీకే ఎదురైన ప్రజా వ్యతిరేకత మోదీకి ఎందుకు రాదు?: రాహుల్ గాంధీ ప్రశ్న
  4. ఆంధ్రప్రదేశ్‌లో అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు: బియ్యం, ఉల్లి భారం

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు