కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ప్రజా వ్యతిరేకత (యాంటీ ఇన్‌కంబెన్సీ) అనేది సహజమని, కానీ మోదీ విషయంలో అది ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. భారత రాజకీయ చరిత్రను గుర్తుచేస్తూ.. 1971లో పాకిస్తాన్‌పై యుద్ధం గెలిచిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ లభించిందని రాహుల్ పేర్కొన్నారు. అయితే అంతటి ప్రజాదరణ పొందిన ఇందిరా గాంధీకి కూడా 1-2 ఏళ్ల వ్యవధిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదురైందని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు: బియ్యం, ఉల్లి భారం!
ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా పాలన సాగించే కొద్దీ ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజమైన ప్రక్రియ అని, మరి అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ నాయకత్వానికి ఆ వ్యతిరేకత ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. తాము రాబోయే 50 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటామని బీజేపీ నేతలు ధీమాగా ఎలా ప్రకటిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ‘ఓట్ చోరీ’ మాత్రమే సమాధానమని, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూనే వారు అధికారంలో కొనసాగుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామం.. సుమలత కార్యవర్గం రద్దు
