టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత నేతృత్వంలోని తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం.
ఈ పరిణామంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సుమలత తన పదవిని కోల్పోయారు. కార్యవర్గంపై జరిగిన సమావేశంలో సభ్యుల మద్దతు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమలతకు 11 మంది సభ్యులు మద్దతు తెలపగా.. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించినట్లు సమాచారం.
కార్యవర్గాన్ని రద్దు చేసిన నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్త ఎన్నికలు నిర్వహించేందుకు ఫెడరేషన్ నిర్ణయించింది. అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడే అవకాశం ఉంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
also read: మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు.. బినామీ ఇంట్లో భారీగా నగదు, విదేశీ కరెన్సీ
