సాధారణంగా జ్వరం లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్లు కొన్ని రోజుల పాటు వాడటానికి యాంటీబయాటిక్స్ మందులను సూచిస్తుంటారు. అయితే, చాలామంది రెండు రోజులు మందులు వాడగానే జ్వరం తగ్గిపోయిందని భావించి, యాంటీబయాటిక్స్ను సగంలోనే నిలిపివేస్తుంటారు. మరికొందరు మిగిలిన మందులను ఇంట్లో దాచిపెడుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
మనం మందులు వాడటం మధ్యలోనే మానేస్తే, శరీరంలో ఉన్న బలమైన క్రిములు (బ్యాక్టీరియా) పూర్తిగా చనిపోవు. శరీరంలో మిగిలిపోయిన ఆ క్రిములు ఆ మందులకు అలవాటుపడి, వాటిని ఎదుర్కొనే శక్తిని సంతరించుకుంటాయి. దీనినే వైద్య పరిభాషలో ‘యాంటీబయాటిక్ రెసిస్టెన్స్’ అని పిలుస్తారు.
ఒక్కసారి క్రిములు ఈ రెసిస్టెన్స్ సాధించాయంటే, భవిష్యత్తులో మళ్లీ జ్వరం లేదా వ్యాధి వచ్చినప్పుడు ఆ మందులు శరీరంలో అస్సలు పనిచేయవు. దానివల్ల వ్యాధి నయం కావడం కష్టంగా మారడమే కాకుండా, ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి జ్వరం తగ్గినా సరే, డాక్టర్ ఎన్ని రోజులు మందులు వాడమని సూచిస్తే అన్ని రోజులు తప్పనిసరిగా మెడిసిన్స్ కోర్సును పూర్తి చేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. రెండో స్థానానికి ముకేష్ అంబానీ!
