భారతదేశ కుబేరుల జాబితాలో బిగ్ చేంజ్ చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా నిలిచారు. తాజాగా విడుదలైన ‘M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2026’ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ముకేష్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.ఈ నివేదిక వివరాల ప్రకారం, గడిచిన ఏడాది కాలంలో అదానీ మరియు ఆయన కుటుంబ ఆస్తులు 13 శాతం పెరిగి ఏకంగా రూ.9.23 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు, ముకేష్ అంబానీ కుటుంబ ఆస్తుల విలువలో 10 శాతం తగ్గుదల నమోదై రూ.8.63 లక్షల కోట్లకు చేరింది. దీంతో అదానీ అగ్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, వ్యాపార రంగంలో దివీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన మురళీ దివి కుటుంబం (దివీస్) తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రూ.1,25,000 కోట్ల ఆస్తులతో మురళీ దివి కుటుంబం తెలుగు రాష్ట్రాల నుంచి తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాల ఆస్తుల హెచ్చుతగ్గులు, ఈ తాజా కుబేరుల జాబితా ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాంగ్రెస్ లో ‘ఎమ్మెల్సీ’ సందడి…!
