Homeఆంధ్ర ప్రదేశ్డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా రగడ...!

డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా రగడ…!

  • ధ్రువపత్రాలతో హాజరైన ఉపాధ్యాయులు

  • నిరుద్యోగుల ఆక్రోశం ముసుగులో వైసిపి శ్రేణులు

  • విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఆందోళన

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో డీఎస్సీ 2025 పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అది దగా డిఎస్సి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. పారదర్శకంగా జరిపినట్లు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనుకూల మీడియా లేవనెత్తిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తోంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై ఆరోపణలు చేస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ పతకాలు, సర్టిఫికెట్లు, గతంలో పొందిన సత్కారాల ఆధారాలతో సహా నేరుగా శాప్ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

  • వైసీపీ నేతలకు సవాల్…

Also Read: DSC స్కామ్‌పై CBI విచారణకు జగన్ డిమాండ్!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు తమ సర్టిఫికెట్లను చూపిస్తూ వైసిపి నేతలకు సవాల్ చేశారు. ఇందులో ఫేక్ ఎలా తేల్చుతారో చెప్పాలని సవాల్ చేశారు. క్రీడాకారుల సవాల్ కు సమాధానం చెప్పలేక.. వారి వద్ద ఉన్న ఆధారాలను చూసి నోళ్లు వెళ్ళబెట్టారు వైసీపీ నేతలు. ఈ విషయంలో సీన్ రివర్స్ అవుతుందని తెలిసి రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో కొందరు భౌతిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రింబవళ్ళు మైదానాల్లో శ్రమించి, శారీరక గాయాలను తట్టుకొని.. జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులపై, మహిళా టీచర్లపై విచక్షణ లేకుండా వైసీపీ శ్రేణులు ప్రవర్తించారంటూ ప్రజా సంఘాలు, క్రీడా లోకం మండిపడుతోంది.

  • దేవినేని అవినాష్ అనుచరులంటూ…

Also Read: హద్దులు మీరితే చూస్తూ ఊరుకోం: వైసీపీ నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!

మరోవైపు విజయవాడ శాప్ కార్యాలయానికి ఆందోళనకు వచ్చిన వారంతా దేవినేని అవినాష్ అనుచరులంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల ఆక్రోసం ముసుగులో వారంతా పెయిడ్ కిరాయి బ్యాచ్ అంటూ డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అవినాష్ అనుచరులుగా ఉన్న కొందరు రౌడీషీటర్లు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లతో కూడిన దాదాపు 200 మంది ముఠాను ఇందుకోసం ప్రత్యేకంగా సమీకరించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు జండాలు పట్టుకుని ఉన్న వారంతా ఈసారి ఆందోళనకు వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు